హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
Also Read:శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలు సరికాదు