ఇంటి అద్దెపై 18శాతం జీఎస్టీ..!

173
- Advertisement -

పన్నుల బాధుడులో కేంద్రం ఎక్కడా తగ్గడం లేదు. దీంతో కేంద్రం తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుండగా తాజాగా అద్దె ఇళ్లలో ఉంటున్నట్టయితే, ఇంటి అద్దెపై వారు 18 శాతం జీఎస్టీని చెల్లించాలంటూ వార్తలు షికార్ చేస్తుండగా దీనిపై స్పందించింది కేంద్రం.

దీంట్లో వాస్తవం….. ఓ ఇంటిని వ్యాపార సంస్థ అద్దెకు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంటి అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చినప్పుడు, వ్యక్తిగత అవసరాలకు ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు ఆ ఇంటి అద్దెపై ఎలాంటి జీఎస్టీ కట్టనక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

అద్దెకు ఉంటున్న ప్రతిఒక్కరూ జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్‌టీ నమోదిత వ్యక్తులందరూ కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకుండే వారెవరూ జీఎస్‌టీ చెల్లించనక్కర్లేదని తెలిపారు. వేతన జీవులకు ఎలాగూ జీఎస్‌టీ పరిధిలో ఉండరు కాబట్టి వారు కూడా అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్రం స్పష్టత ఇచ్చింది.

- Advertisement -