చరిత్రలో ఈరోజు..సెప్టెంబర్ 14

538
swamy vivekananda
- Advertisement -

చరిత్రలో ఇవాళ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది..స్వామి వివేకానంద చికాగో సభలో ప్రసంగించి 120 సంవత్సరాలు.ప్రసంగానికి లభించిన 2 నిమిషాల సమయాన్ని సద్వినియోగం చేస్కోవడమే కాకుండా..తన ప్రసంగంతో ప్రపంచ దేశాలా వారిని మంత్ర ముగ్దులని చేసి.. 2 నిమిషాలా సమయం గంటకు పైన కొనసాగింపయింది.. అందరు స్వామి వివేకానంద గారి మాటల మాయలో బంధీలయిపోయారు..

1893 సెప్టెంబరు 11 వ తేదీన చికాగోలో జరిగిన సర్వమత సభలో హిందూ ధర్మ ప్రతినిధిగా హాజరయ్యారు స్వామి వివేకానంద. మతం అంటే ఇతర సంస్కృతిలపై చేసే ఒక తరహా యుద్ధంగా, మూఢనమ్మకాల వ్యాప్తిగా అప్పటివరకు భావిస్తున్న ప్రపంచానికి అసలుసిసలైన ధర్మాన్ని ఈ సభ ద్వారా పరిచయం చేశారు వివేకానందులు. మా మతమొక్కటే సత్యమూ, మా దేవుడిని తప్ప ఇతర దేవళ్ళను పూజించే వారు నరకానికి పోతారంటూ మ్లేచ్చమతాలకు భిన్నమైనది, సర్వ మతాలను సత్యమని భావించేది, ఎన్ని నదులున్నా, అన్ని సముద్రాన్నే చేరినట్టు, అన్ని మతాలు ఒకే పరమాత్మను చేరుతాయని గట్టిగా విశ్వసించే ఒక ధర్మం ఉందని, అది మన హిందూ ధర్మమేనని సమస్త ప్రపంచానికి తన తొలి ప్రసంగం ద్వారా తెలియపరిచారు స్వామి వివేకానంద.

ఎవరైన మీ హిందువుల గొప్పతనం ఏంటని అడిగితే ఒక్క సమాధనం చెప్పండి. ఎన్నో మతాల ప్రతినధుల ఉపన్యాసలతో విసుగెత్తిపోయిన, విరక్తి చెందిన ప్రేక్షకులలో, 5 మాటలు, అమెరికన్ సోదర సోదరీమణులారా అనే కేవలం 5 మాటల చేత ఉత్తేజ పరిచారు. ఆ 5 మాటలకే 2 నిమిషాలపాటు సభప్రాంగణం మార్మోగిపోయేలా కరతాళధ్వనులు(చప్పట్లు కొట్టారు) చేశారు ప్రేక్షకులు. ఆనాడు ఆయన చేసిన ప్రసంగం ఈరోజు విన్నా, అంతే శక్తివంతంగా, ఉత్తేజితంగా ఉంటుంది. ఒక హిందు ప్రతినిధి చేసిన ప్రసంగం అమృతమై, శాశ్వతమై, ఏళ్ళు గడిచినా ఈరోజుకి ఎందరి చేతనో కొనియాడబడుతోందంటే, అదే మన హిందువుల గొప్పతనం, హిందువైన వివేకానందుడి గొప్పతనం. అందుకే ఆ ప్రసంగం చారిత్రాత్మికమైంది.

కుల గజ్జి మతం మత్తులో అప్పటివరకు మునిగి తేలిన జనాలు.. ఒక్క సారి కళ్ళు తెరచిన రోజది.. ప్రతీ మతానికి ఒక గొప్పతనం ఉంటది.. దాన్ని కాలరాసి మతమార్పిడి చేస్తే నిన్ను నువ్వు చంపుకున్నంత.. అదే ఆ ప్రసంగం యొక్క ముఖ్య సారాంశం..

- Advertisement -