గ్రీన్‌ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన అనసూయ

772
anasuya green challenge

ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం అనే మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఈ హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా హరిత ఉద్యమంగా రూపుదాల్చి మూడు కోట్ల మైలురాయిని అధిగమించి అపురూప ఘట్టంగా నిలిచింది.

anasuya

తాజాగా సంతోష్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరికొంతమందికి ఈ ఛాలెంజ్‌ ఇచ్చారు. బొంతు రామ్మోహన్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించిన సినీనటి అనసూయ కేబీఆర్ పార్క్‌ ముందు జీహెచ్‌ఎంసీ ఏరియాలో మొక్కలు నాటారు.

ఆ తర్వాత తన కొడుకుతో పాటు..యాంకర్ సుమా కనకాల, నటులు అడివి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ ను మొదలుపెట్టి…కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అనసూయ అభినందించారు. గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని యాంకర్ అనసూయ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు కాదంబరి కిరణ్,అడిషనల్ కమిషనర్ కృష్ణ, గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

anasuya green challenge

anasuya anasuya