- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ముస్తాబద్ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలగా ఆ వ్యక్తి ఇటీవల దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. వెంటనే అతడిని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 15న ఆవ్యక్తి హైదరాబాద్‌కు రాగా ఎయిర్‌పోర్టులో నమూనాలను సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఇవాళ ఫలితాలు రాగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య సిబ్బంది గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో పాటు సదరు వ్యక్తి కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు.
- Advertisement -