ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన ఆసీస్..

73
eng vs aus

యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. భారీ లక్ష్యఛేదనలో తడబడింది ఇంగ్లాండ్.జోస్ బట్లర్ ఆసీస్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న అతడికి ఇతర బ్యాట్స్‌మెన్ నుండి సహకారం లభించకపోవడంతో ఓటమి పాలైంది ఇంగ్లాండ్. డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో ఆసీస్‌కు ఇది తొమ్మిదో విజయం కాగా.. స్వదేశంలో గులాబీ బంతితో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ గెలవడం విశేషం.

468 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 82/4తో సోమవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ చివరకు 192 పరుగులకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (207 బంతుల్లో 26) తుదివరకు పోరాడాడు. జే రిచర్డ్‌సన్‌ ఐదు వికెట్లతో విజృంభించగా లబుషేన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 473/9 డిక్లేర్డ్‌
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 236 ఆలౌట్‌
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 230/9 డిక్లేర్డ్‌
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 192 ఆలౌట్‌