భారత ఆర్థిక వ్యవస్థ 3 సంపుటిని ఆవిష్కరించిన జూలూరి..

34
gowri shankar

ఎస్.ఎ. విద్యాసాగర్ రచించిన భారత ఆర్థిక వ్యవస్థ 3 సంపుటిని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఒక దేశ ర‌థ చక్రం న‌డ‌వాలంటే ఆర్ధిక వ్యవ‌స్థ బాగుండాలని,ఏ దేశ ఆర్ధిక వ్యవ‌స్థ బాగుండ‌క‌పోతే ఈ దేశం చిన్నిభిన్నంఅవుతుంద‌ని బుక్ ఫెయిర్ అధ్య‌క్ష‌లు జూలూరి గౌరి శంక‌ర్ అన్నారు. ఆర్ధిక వ్య‌వ‌స్థ చ‌ట్రం తెలిసిన మనిషి ప్రభుత్వ నివేదికల ద్వారా ఈ పుస్తకం ఎంతో ప్రామాణికత సంతరించుకుందని అన్నారు. విక్టోరియా మహారాణి నుండి మోడీ దాకా ఆర్థిక రంగం ఎలా పాలించారో ఈ పుస్తకం చెబుతుందని జూలురి పేర్కొన్నారు.

విద్యాసాగర్ రచించిన దేశ ఆర్థిక వ్యవస్థ మూడు సంపుటాలు ఎంతో ప్రాచుర్యం పొంది నాల్గోవ సంపుటి వస్తుందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు తెలిపారు. విద్యాసాగర్ రచించిన పల్లెను మింగిన పెట్టుబడి 115 గ్రామాలను సర్వే చేసి రచించిన పుస్తకం ఎంతో ఉపయోగ కరంగా ఉందని చెప్పారు. సోవియట్ బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ ఇంగ్లాండ్ దేశాలలో పెట్టుబడిదారీ దేశాల్లో భారీ లాభాలు రావడంతో కార్మికవర్గానికి వాటా అందుతోంది.అందుకే వారు విప్లవం వైపు చూడరు. రచయిత తెలుగు రాష్ట్రాలలో ఈ పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు.

ఈ పుస్తక ఆవిష్కరణ సభ కు సీనియర్ జర్నలిస్ట్ కొండూరి వీరయ్య, అధ్యక్షత వహించగా పుస్తక పరిచయాన్ని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు పుస్తక పరిచయం చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, వందన సమర్పణ చేశారు.