గత చరిత్రలోకి పాత పార్లమెంట్‌

40
- Advertisement -

1911లో బ్రిటీష్ ప్రభుత్వం కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించారు. అయితే అప్పటివరకు అక్కడ ఏ ఒక్క అధికారిక భవనం లేదు. ఇందుకోసం బ్రిటీష్‌ ప్రభుత్వం 1913లో ఢిల్లీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే ప్రస్తుత రాష్ట్రపతి భవన్‌లో నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. సమ్మర్‌లో మాత్రం శిమ్లాలోనే వైస్రాయ్ భవనం ఏర్పాటు చేసుకున్నారు.

1918లో వచ్చిన మాంటెగ్‌ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలకు అనుగుణంగా కౌన్సిల్‌ను విస్తరించారు. దీంతో కౌన్సిల్‌కు కోసం ఒక కొత్త భవనం ఏర్పాటు కోసం 1921లో సెక్రటేరియెట్ భవనంలోనే ఓ భారీ ఛాంబర్ కట్టారు. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి భవనం. అదే సంవత్సరంలోని ఫిబ్రవరి12న డ్యూక్ ఆఫ్ కానాట్ ఫ్రిన్స్ ఆర్డర్ కొత్త పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. దీన్ని బ్రిటీష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్‌లు డిజైన్‌ చేశారు. ఇది సుమారుగా ఆరు ఎకరాల్లో 144పిల్లర్లతో నిర్మించారు. 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ను ప్రారంభించారు. ఈ భవనం ఆకృతికి మధ్యప్రదేశ్‌లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తి అంటారు.

Also Read: మోడీజీ 9 ఏళ్ళు, 9 సవాళ్ళు.. సమాధానం ఉందా?

దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్‌లు కలిసి బాంబు విసిరి సంచలనం సృష్టించారు. అంతేకాదు ఇందులోనే సూప్రీంకోర్టు కార్యకలపాలు కూడా నడిచాయి. అలాగే యూపీఎస్సీ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు 2001లో ఆఫ్జల్‌గురు సహాయంతో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడినీ ఎదుర్కొంది. అలాగే దేశంలో అనే గుణాత్మకమైన మార్పులకు భవనం ప్రధాన కారణం.

Also Read: ఆయనే సి‌ఎం.. బి‌ఆర్‌ఎస్ కే పట్టం?

- Advertisement -