మోడీజీ 9 ఏళ్ళు, 9 సవాళ్ళు.. సమాధానం ఉందా?

69
- Advertisement -

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు పూర్తయింది. 2014 లో నరేంద్ర మోడీ తిరుగులేని ప్రజాకర్షణ కారణంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 2019 లో కూడా అదే మేనియాను కొనసాగించి అధికారం చేజిక్కించుకుంది. మరి ఈ తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ చేసిన అభివృద్ది ఏంటి ? దేశంలో ఎలాంటి మార్పులు తీసుక్చ్చారు ? ఇంతకీ మోడీ సర్కార్ పై ప్రజాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది ? వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీ సర్కార్ కు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ? అనే ప్రశ్నలు రాకమానవు. అయితే మాత్రం మోడీ ప్రధానిగా బాద్యతలు చేపట్టిన తరువాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, దేశంలో మోడీ పాలన ఇతర దేశాలకు మార్గదర్శికంగా కమలనాథులు పదే పదే చెబుతన్నారు. ఈ నేపథ్యంలో ఈ తొమ్మిదేళ్ల మోడీ సర్కార్ పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ట్విట్టర్ వేధికగా పలు 9 ప్రశ్నలను సంధిస్తూ మోడి వైఫల్యాలను ట్వీట్ చేసింది.

Also Read:పిక్ టాక్ : రకుల్ ఆన్ గ్లామర్ ఫైర్

ప్రస్తుతం కాంగ్రెస్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ది చేయడంలో మోడి సర్కార్ ఘోరంగా విఫలం అయిందని, పేదరికాన్ని నిర్మూలిచడంలో కూడా మోడి ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇక రైతులకు అన్యాయం చేస్తూ రైతు చట్టాల విషయంలో కూడా మోడి సర్కార్ విఫలం అయిందని, ఇంకా అవినీతిని నిర్మూలించడంలోనూ, చైనా-జాతీయ భద్రత విషయంలోనూ, సామాజిక న్యాయం, ప్రజస్వామ్య పరిరక్షణ, సొంక్షేమ పథకాల అమలు, వంటి వాటిలో మోడి సర్కార్ విఫలం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఇంకా కోవిడ్ 19 ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కూడా మోడీ సర్కార్ విఫలం చెందిందని కాంగ్రెస్ రాసుకొచ్చింది. దీంతో దేశ ప్రజలు మోడీ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి కాంగ్రెస్ విసిరిన 9 సవాళ్ళకు మోడీ సర్కార్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

Also Read:‘ఎన్టీఆర్ 30’లో యంగ్ హీరో ?

- Advertisement -