వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..

241
oil
- Advertisement -

కరోనా లాక్‌డౌన్ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఏడాదిలో వంట నూనెల ధరలు 100 శాతం పెరగగా సామాన్యులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది కేంద్రం.

క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధిస్తూ 10 శాతానికి తగ్గించింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గే అవకాశముంది. అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 37.5 శాతానికి దిగొచ్చింది. దీంతో సాధారణ ప్రజలకు తాత్కాలికంగా కాసింత ఊరట లభించనుంది.

- Advertisement -