బర్త్ డే…మొక్కలు నాటిన ఎమ్మెల్యే రవిశంకర్

179
green
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన …రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నాకెంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా వినూత్నమైన మార్పు తీసుకొచ్చిందని అన్నారు.

- Advertisement -