యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. గతంలో ‘రామ్ లీలా’ షూటింగ్ జరుపుకున్న భవనంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగును పూర్తిచేసుకుంది. దసరాకి ఈ సినిమా థియేటర్స్ లో ఉండాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ నెలాఖరుకి పూర్తయ్యేలా లేదని, చాలా వర్క్ పెండింగ్ వుందని గుసగుసలు వున్నాయి.
సెప్టెంబర్ రెండవ వారానికి గానీ పూర్తి కాకపోవచ్చునని చెబుతోన్న నేపథ్యంలో సెప్టెంబర్ 21న రావడం దాదాపు అసాధ్యమని సమాచారం. కానీ ఆ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. ఈ కారణంగా ఈ సినిమా అక్టోబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ 27 డేట్ ‘స్పైడర్’ విడుదల కానుంది. దీంతో ‘జై లవకుశ’ 29కి వెళుతుందా లేక అక్టోబర్‌కి వాయిదా పడుతుందా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే నిర్మాతల వైపు నుంచి ఇంతవరకు వాయిదా గురించిన సమాచారం లేదు. అదే నిజమైతే మహేష్ స్పైడర్‌కు పోటీ లేనట్టే..!