Jr.NTRఎన్టీఆర్ తో హృతిక్.. రికార్డ్స్ షేకే

44
- Advertisement -

రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితుడు. కానీ ఎందుకో ఆర్ఆర్ఆర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కి కాస్త అన్యాయం జరిగింది. ఈ సినిమాకు గానూ ఎన్టీఆర్ అభిమానులు ప్రతి సందర్భంలో అసంతృప్తికి గురి అయ్యారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత తమ హీరో రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అని నమ్మిన ఫ్యాన్స్ కి చివరకు నిరాశ నిస్పృహ మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన (War) వార్ మూవీకి సీక్వెల్ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ‘వార్-2’ మూవీ రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండగా.. హృతిక్ ఫైటర్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ గా హృతిక్ కి – ఎన్టీఆర్ కి పేరు ఉంది.

అలాంటి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే. కచ్చితంగా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుంది. పైగా హృతిక్‌ తో క‌లిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది నిజ‌మైతే మాత్రం ఎన్టీఆర్‌కు గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ద‌క్కినట్టే. అలాగే హృతిక్ కి కూడా గ్రాండ్ గా సౌత్ ఎంట్రీ ద‌క్కినట్టే. పైగా ఈ సినిమాలో హృతిక్ రోష‌న్ – ఎన్టీఆర్ క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయని టాక్.

ఇవి కూడా చదవండి…

‘మీటర్’ కమర్షియల్ ఎంటర్ టైనర్ 

పవన్ దర్శకులకు మంచి రోజులు

పుష్ప 2 టీజ‌ర్.. ర‌ష్మిక క్యూట్ లుక్

- Advertisement -