పుష్ప 2 టీజ‌ర్.. ర‌ష్మిక క్యూట్ లుక్

38
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప‌2 చిత్రాన్ని యావ‌త్ భార‌తదేశం అంతా ప్రమోట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కి ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 8న బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ టీజ‌ర్‌ను టీమ్ ప్లాన్ చేసింద‌నే విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. పుష్ప స్పెష‌ల్ టీజ‌ర్ ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 4:05 గంట‌ల‌కు రిలీజ్ కానున్న‌ట్లు ఆ గ్లింప్స్‌లో అనౌన్స్ చేసింది. మొత్తానికి ‘పుష్ప2’ టీజ‌ర్ డేట్ లాక్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అన్నట్టు ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక జంట‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ ర‌ష్మిక మంద‌న్నా పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ చెప్తూ, స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. పోస్ట‌ర్‌లో ర‌ష్మిక ట్రెడిష‌న‌ల్ లంగా ఓణీలో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. మొత్తానికి తన లుక్ తో రష్మిక ఆకట్టుకుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. బన్నీ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

ఇక పుష్ప 2 పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 యాక్షన్ ఎంటర్ టైనర్ అని కొందరు.. కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మరి కొంతమంది అంటున్నారు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లోని ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూనే రమణ మహర్షి భావాలను కూడా బన్నీ పాత్రలో సుకుమార్ జోడించాడు. ఈ కోణంలో కొత్తగా కథలో కొన్ని మార్పులు కూడా చేశారట. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -