TELANGANA:అదంతా.. బండి సంజయ్ కుట్ర!

53
bandi
- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల టిఎస్ పిఎస్సీ ప్రశ్నాపత్రం, తాజాగా పదవ తరగతి ప్రశ్న పత్రం.. పరీక్షకంటే ముందే సోషల్ మీడియాల్లో దర్శనమివ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఎంతో పకడ్బందీగా భద్రతతో కూడిన ప్రశ్నపత్రాలు లీకేజ్ కావడం ఎంటనే సందేహం అందరిలోనూ మెదులుతోంది. అయితే దీని వెనుక బీజేపీ నేతల అతిపెద్ద కుట్ర దాగి ఉందనేది తాజాగా బయటపడుతున్న పరిణామాలతో తేటతెల్లమౌతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలు కుతంత్ర రాజకీయాలు చేయడం కొత్తేమీకాదు. అయితే విద్యార్థుల భవిష్యత్ తో ముడిపడి ఉన్న పరీక్ష పత్రాలను ఎగ్జామ్ కంటే ముందే బయట పెట్టి ఆ నేరాన్ని కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై తోసేయ్యాలనే కుతంత్ర రాజకీయానికి తెరతీశారు బీజేపీ చీఫ్ బండి సంజయ్.

అయితే బండి వేసిన కుతంత్ర వ్యూహం బెడిసికొట్టింది. టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కావడం వెనుక బండి హస్తం ఉండడంతో ప్రస్తుతం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ తో బండి సంజయ్ చేసిన నీచరాజకీయాన్ని చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. అన్నీ వైపులా బండి సంజయ్ చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధ్యక్ష హోదాలో ఉండి ఇలాంటి పని చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు బండిని ఏకీపారేస్తున్నారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికి ఏ అవకాశం లేకపోవడంతో.. ఇలా దుర్మార్గమైన చర్యలకు బీజేపీ నేతలు పాల్పడడం నిజంగా సిగ్గుచేటు అనే చెప్పుకోవాలి. అయితే ఇదంతా ఈ లీకేజ్ వ్యవహారం అంతా బీజేపీ పెద్దల అనుమతితోనే పక్కా ప్రణాళికతోనే బండి సంజయ్ ప్రశ్న పత్రాల లీకేజ్ కు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించి బీజేపీ నేతలే చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -