ఎన్టీఆర్‌ సీక్రెట్‌ గా దాచిన ఆ ఇద్దరి పేర్లు…

206
NTR Speech At Jai Lava Kusa Pre Release Event...
- Advertisement -

ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు తేలిపోయింది. అసలు విషయానికొస్తే..’జై లవకుశ’ చిత్రంలో తాను నటించడానికి ఇద్దరు ముఖ్య కారకులు ఉన్నారని, వారిద్దరి పేర్లు ఇప్పుడు చెప్పబోనని, సినిమా విడుదల అయిన తరువాత, హిట్ అయితే మాత్రమే చెబుతానని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? అయితే అదే విషయంపై అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఎస్ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్ పేర్లను ఊహించారు.

 NTR Speech At Jai Lava Kusa Pre Release Event...కానీ, తాజాగా రచయిత కోన వెంకట్ కు ఓ అభిమాని నుంచి సోషల్ మీడియాలో ఇదే విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. ఆ వెంటనే క్లారిటీ ఇచ్చేసిన కోన వెంకట్, వారు కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి, అభిమానులు ఓ 50 పర్సెంట్ సక్సెస్ అయ్యారని అన్నాడు.

ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఓకే చేయడం వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని కోన వెంకట్ చెప్పేంతవరకూ ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.

- Advertisement -