హనీమూన్‌ ఫొటోలు కూడా షేర్‌ చేసేసింది..!

216
Samantha Akkineni shares pictures from her honeymoon
- Advertisement -

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్‌ కొత్త జంట ఇప్పుడు లండన్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ 40 రోజులపాటు హనీమూన్ ఎంజాయ్ చేస్తారంటూ పెళ్లికి ముందే వార్తలు వినిపించాయి.

 Samantha Akkineni shares pictures from her honeymoon

కానీ తమకు వర్క్ కమిట్‌మెంట్లు ఉన్నాయని, అవన్నీ తప్పుడు వార్తలని సమంత కొట్టిపడేసింది. డిసెంబర్లో వీరిద్దరూ ఎక్కువ రోజులు హాలీడే తీసుకునే ఆలోచనల్లో ఉన్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి మినీ హనీమూన్లో ఉన్న సమంత.. రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 Samantha Akkineni shares pictures from her honeymoon

తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, భర్త నాగ చైతన్య ఫొటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటికి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. ఇక ప్రస్తుతం లండన్లో ఉన్న వీరిద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లి ఇండియా వస్తారు. తర్వాత ఇద్దరూ షూటింగ్స్‌తో బిజీ కానున్నారు.

- Advertisement -