దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విజయేంద్రప్రసాద్ స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేశారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో కార్పోరేట్ సంస్థల దృష్టి ఈ ఇద్దరు యంగ్ హీరోలపై పడింది. వీరితో పోటాపోటీగా తమ బ్రాండ్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇటీవల ‘హప్పి’ అనే మొబల్స్ స్టోర్ సంస్థ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘హప్పి’ మొబైల్ స్టోర్ పోటీగా ‘సెలక్ట్’ అనే మరో మొబైల్ స్టోర్ సంస్థ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అయితే ఈ మొబైల్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం రామ చరణ్ బోయపాటి సినిమాలో నటిస్తుండగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అరవింద సమేత అనే మూవీలో నటిస్తున్నాడు.