Mangoes:ఈఎంఐ ఆఫర్‌

38
- Advertisement -

వేసవి వస్తే చాలు మామిడి పండ్ల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తికాదు. నిజానికి సవిలో మనకు లభించే అద్భుతమైన ఫలం మామిడి. సీజనల్‌గా వచ్చే ఈ పండ్లు ప్రతి ఒక్కరి నోరు ఊరించడం ఖాయం. బంగినపల్లి, తోతపురి, కొబ్బరి మామిడి, రసాలు ఇలా అనేక రకాల మామిడి పండ్లు మన కళ్లముందు కనబడుతుంటే ఆగలేక తినేస్తాం. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు.

అయితే ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉండడం దానికి తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో ధరలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మామిడిపండ్ల ప్రియుల కోసం మహారాష్ట్రలోని ఓ వ్యాపారి సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చాడు.

ముందు తినండి ఆ తర్వాతే డబ్బులివ్వండంటూ ఈఎంఐ పద్ధతిలో పండ్లు అమ్ముతున్నారు. అయితే రూ.5 వేలకు పైగా విలువైన పండ్లు కొంటే క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపారి షాపు యజమాని. పుణెలోని గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ దుకాణం యజమాని గౌరవ్ సనాస్ ఈ ఆఫర్ ను ప్రకటించారు. ఆల్ఫాన్సా రకం మామిడిపండ్ల ఖరీదు డజనుకు రూ.800 నుంచి రూ.1300 గా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఈఎంఐ పద్ధతిలో ఐదుగురు కస్టమర్లు మామిడిపండ్లను కొనుగోలు చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -