మన ఊరు మన బడి…ఎన్నారై విరాళం

35
- Advertisement -

తెలంగాణలోని ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్‌ తరహాలో విద్యను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంకు తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఎన్నారై రమేష్ ఇసంపల్లి. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని హమాలీవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న తన 8గుంటల భూమిని పాఠశాలకు విరాళంగా అందజేశారు.

ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లంతో కలిసి దీనికి సంబందించిన పత్రాలను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… మన ఊరు మన బడి కార్యక్రమం గొప్పగా ముందుకు పోవడానికి దానికి కారణం ఎన్నారైలు అని అన్నారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డపై చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనదిని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకున్న రమేష్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ మన ఊరు-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇటీవల లండన్ లో పర్యటించిన కేటీఆర్ తెలంగాణ తల్లి ఋణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలసిరావాలని ఎన్నారైలకు ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది తనవంతు సహకారం అందించానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన వ్యాపారవేత్త రాజేశ్వర్‌

పచ్చి గుడ్డు తింటున్నారా.. జాగ్రత్త!

మొక్కలు నాటిన షాబాద్‌ జెడ్పీటీసీ…

- Advertisement -