ఆమె కోసం ఎన్టీఆర్ వెయిటింగ్

74
- Advertisement -

స్టార్ హీరోలను బట్టే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు పూర్తి అవుతుందో ఓ ఐడియా ఉంటుంది. టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్, బన్నీ ల దగ్గర నుంచీ.. బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, అమీర్ వరకూ హీరోలే తమ సినిమా ప్లానింగ్ ను ఫైనల్ చేస్తారు. కానీ, ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా వ్యవహారం వేరుగా వుంది. ఎన్టీఆర్ కి దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ మొత్తం వినిపించాడు. కథలో చిన్న చిన్న మార్పులు సూచించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆ మార్పుల పని నడుస్తోంది.

ఆల్ మోస్ట్ ఆ మార్పులు కూడా పూర్తి అయ్యాయి. అయినా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. కారణం.. ఈ సినిమా ప్రారంభం కావాలంటే హీరోయిన్ దీపికా పదుకొనే దయ తలచాల్సి వుందట. అలియా భట్ ప్లేస్ లో చాలామంది పేర్లు అనుకుని.. చివరకు దీపికా పదుకొనే ను ఫైనల్ చేసుకున్నారు కొరటాల టీమ్. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా మీద ఉంది. అలాగే షారుఖ్ ఖాన్ తో కలిసి చేసిన పఠాన్ సినిమా లాస్ట్ షెడ్యూల్ అండ్ ప్రమోషన్స్ లో ఉంది. మొత్తానికి దీపికా పదుకొనే బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది.

పైగా దీపికా పదుకొనే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే దీపికా పదుకొనే చేతిలో పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే, దీపికా పదుకొనే ఎన్టీఆర్ సినిమాకు ఎప్పుడు డేట్ లు ఇస్తుందో క్లారిటీ లేదు. ఎన్టీఆర్ సరసన దీపికా పదుకొనే నటిస్తే.. హిందీలో తమ సినిమాకి మార్కెట్ అవుతుందని కొరటాల తో పాటు నిర్మాతలు కూడా ఫీల్ అవుతున్నారు. కానీ, దీపికా పదుకొనే కోసం రోజుల తరబడి ఎదురు చూసే అవకాశం ఉందా !. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. హీరోయిన్ని మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి…

పవన్​ కి బాలయ్య ఆత్మీయ ఆహ్వానం

చిరు వర్సెస్ బాలయ్య..భారీ బెట్టింగులు!

బాలయ్యతో పవన్

- Advertisement -