- Advertisement -
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు సమర్పించారు. ఈమేరకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు ఆయన వెంట మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేయగా.. ఆయన వెంట దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ పాల్గొనగా, రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట చీఫ్ బండి సంజయ్‌లు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్ ధాఖలు చేశారు. ఇక ఈరోజు నామినేషన్లు పర్వం ముగియడంతో ఈనెల 11న స్క్రూటిని జరగనుండగా.. 13న ఉపసంహరణ గడువు ముగియనుంది.
- Advertisement -