‘మ‌హా స‌ముద్రం’ సెన్సార్ పూర్తి..

76

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘మ‌హాస‌ముద్రం’. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని క‌లిగిస్తోంది.

ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికెట్‌ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేశ్,’గరుడ’ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలను అజయ్ భూపతి చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడట. అందువలన ఈ పాత్రలు మూడు కూడా ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. దసరా బరిలో ఈ సినిమా సందడి చేయనుంది.