- Advertisement -
యంగ్ హీరో నిఖిల్ తన ఫ్రెండ్ పల్లవి వర్మను పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇటివలే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఏప్రిల్ 16న వీరి వివాహం జరుగనుంది. నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే తనకు పెళ్లి పనులు చూసుకునే తీరిక కూడా లేదంటున్నాడు నిఖిల్. కార్తీకేయ2 మూవీని దసరాకు విడుదల చేయాలని ఫిక్స్ అవ్వడంతో..అస్సలు తీరిక ఉండటంలేదని చెప్తున్నాడు.
పెళ్లి పనులు కూడా తమ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారని తెలిపాడు. అయితే సినిమా పూర్తయ్యేవరకు హనీమూన్ కి కూడా వెళ్లేది లేదని డిసైడ్ అయ్యాడట. పెళ్లి కోసం కూడా షూటింగ్ నుంచి జస్ట్ వీక్ ఆఫ్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇటివలే విడుదల చేసిన ‘కార్తికేయ 2’ కాన్సెప్ట్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలిపాడు.
- Advertisement -