‘ఢీ’ సీక్వెల్‌ కి సిద్దమైన శ్రీను వైట్ల

250
Manchu Vishnu Srinu Vaitla

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోలతో హిట్లు కొట్టిన దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. కొద్ది రోజులుగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు వరుస ప్లాప్ లను మూటగట్టుకున్నాయి. మహేశ్ బాబు నటించిన ఆగడు సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. చివరగా రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని తో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఈమూవీ కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ఢీ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈసినిమాతో మంచు విష్ణుకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ అదే తరహాలో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు శ్రీను వైట్ల. ఢీ మూవీకి సీక్వెల్ తెరకెక్కించిన పనిలో ఉన్నాడు ఈదర్శకుడు. ప్రస్తుతం ఈసీక్వేల్ కు సంబంధించి స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడట. స‌మ్మ‌ర్ త‌ర్వాత ఢీ 2 చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు.