ఆదాయ పన్నుపరిమితి రూ. 5లక్షలకు పెంపు

459
budget 2019
- Advertisement -

ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు లోక్ సభలో ప్రకటించారు నిర్మలా సీతారామన్‌. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మలా వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తాం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధి రూ.400కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.బ్యాంకింగ్ రంగంలో నష్టాలను నివారిస్తామని చెప్పారు. కొత్తగా 1,2,5,20 రూపాయల కాయిన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు.

​గ్రామీణ భారత ప్రగతిలో మహిళ పాత్ర కీలకం. అన్ని చోట్లా మహిళా నాయకత్వం పెరుగుతోందన్నారు.
​​2019 ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 78మంది మహిళలు ఎంపీలుగా విజయం సాధించారని చెప్పారు. ​మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు. ​జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.

​భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు చేస్తామన్నారు.స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు… ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం ఇస్తామన్నారు.

- Advertisement -