కేసీఆర్- స్టాలిన్‌ భేటీ వాయిదా.. కారణం ఇదే..!

192

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మరం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సోమవారం ఆయన భేటీ అయ్యారు. కూటమి ఏర్పాటుపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలకు కూడా ఆయన ఫోన్ చేశారు.

KCR

ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ చెన్నైలో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇంతకుముందు తెలిపింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చిస్తారని పేర్కొంది. అయితే తాజాగా వీరి భేటీపై సందిగ్ధం నెలకొంది. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల జరగనుండగా.. ప్రచారం కారణంగా స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్‌, స్టాలిన్‌ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 13న కాకుండా త్వరలోనే స్టాలిన్‌-కేసీఆర్‌ల భేటీ జరుగుతుందని సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.