- Advertisement -
తెలంగాణలో కరోనా వైరస్ లేదని.. కారోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరికరాలను సైబరాబాద్ సీపీ ఆదివారం పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిర్‌పోర్టులో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు.
- Advertisement -