తానాజీ.. చ‌రిత్ర‌ గుర్తించ‌ని యుద్ధ‌వీరుడు !

246
'No Baahubali, Only Taanaji
'No Baahubali, Only Taanaji
- Advertisement -

రాజమౌళి రూపొందించిన అద్భుతం ‘బాహుబలి’ముందు ఆ తర్వాత విడుదలై బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా నిలవలేకపోయాయి. కనీసం బాహుబలి హిందీ వెర్షన్ సెట్ చేసిన టార్గెట్ ను కూడా రీచ్ కాలేకపోయాయి. ఈ క్రమంలో బాహుబలిని మించిన సినిమా తీయాలనే తపన బాలీవుడ్‌లో మొదలైందనడంలో సందేహం లేదు.. అమీర్ ఖాన్‌ ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌ సినిమా ద్వారా అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టాడని టాక్.. తాజాగా అజయ్ దేవగణ్ హీరోగా ‘తానాజీ’ గా రూపుదిద్దుకుంటోంది.. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ajay-devgn taanaji

మ‌రాఠా వీరుడు సుబేదార్ తానాజీ మ‌లుస‌రే జీవిత క‌థ ఆధారంగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిస్తున్న `తానాజీ` చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను అజ‌య్ దేవ‌గ‌ణ్ ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. యుద్ధంలో బాణాల‌ను ఎదుర్కుంటూ వీరోచితంగా తానాజీ పోరాడుతున్న ఫొటోను అజ‌య్ షేర్ చేశారు. `ఆయ‌న (తానాజీ) త‌న ప్ర‌జ‌లు, త‌న నేల‌, త‌న రాజు శివాజీ కోసం పోరాడారు. వైభ‌వమైన భార‌త‌దేశ చ‌రిత్ర‌ గుర్తించ‌ని యుద్ధ‌వీరుడు, తానాజీ మలుస‌రే` అంటూ ఆయ‌న ట్వీట్ చేశాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బాహుబలి స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు. 2019లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ప్ర‌స్తుతం అజ‌య్ న‌టించిన `బాద్‌షాహో` సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

- Advertisement -