భోజన వితరణ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్

455
- Advertisement -

ఈ రోజు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా భోజన వితరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర ప్రజలు నన్ను రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు. నిజామాబాద్ నగరంలో సుమారు 4 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు.కరోన వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నగర ప్రజలు క్షేమంగా ఉండాలంటే అత్యవసర సేవలు నిరంతరం కొనసాగలన్నారు.

దేశం మరియు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర సేవల సిబ్బందికి కనీసం మంచి నీరు కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితిని నేరుగా గమనించిన నేను ఈ విపత్కర కాలంలో నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది,మంచి నీటి సరఫరా సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వారి ప్రాణాలని లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం పనిచేస్తున్నారు. వీరికి నేను నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను అని తెలిపారు.

ఈ అత్యవసర సిబ్బంది కోసం నా వంతు బాధ్యతగా గత నెల రోజుల నుండి సుమారు 1500 మందికి ప్రభుత్వ జిల్లా అధికారుల సమక్షంలో నాణ్యమైన భోజనం తయారు చేసి ప్రత్యేక బృందాల ద్వారా వారు పనిచేస్తున్న చోటునే భోజనం అందచేస్తున్నాను. లాక్ డౌన్ ఎత్తి వేసేవరకు ఈ యొక్క భోజన వితరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే.

MLA Bigala Ganesh 2

రెడ్ జోన్ కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల…

నగరంలోని బర్కత్ పుర, ఖిల్లా చౌరస్తా కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ….ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లా యంత్రాంగం వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించండి అని కోరారు. అలాగే నగరంలోని సానిటేషన్ 4వ జోన్ లోని కార్యాలయంలో కార్మికులకు మేన డే ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. కార్మికులతో నేరుగా ముచ్చటించారు. అనంతరం కార్మికులకు స్వయంగా స్వీట్ ప్యాకెట్లతో కూడిన భోజనం అందచేశారు.

MLA Bigala Ganesh 3

కరోన వైరస్ వ్యాధి నివారణపై ఉన్నతాధికారులతో సమీక్ష

నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో కరోన వైరస్ వ్యాప్తి మరియు నివారణపై రెవిన్యూ, మునిసిపల్, పోలీస్ సమాచార పౌర సంబంధాల అధికారులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పట్టణంలో నమోదు అయిన, డిశ్చార్జ్ అయిన కేసుల వివరాల్ని అధికారులని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్తుల నేపథ్యంలో తికోవాల్సిన జాగ్రత్తలని అధికారులతో చర్చించారు.లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ప్రజల సహకారం ఎలా ఉందని తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు మరియు అధికారుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవలు కొనసాగించాలని కోరారు.

MLA Bigala Ganesh 4

ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ SA అలీం, మునిసిపల్ కమిషనర్ జితేశ్ వి పాటిల్,RDO వెంకటయ్య, ACP శ్రీనివాస్ కుమార్,సత్యప్రకాశ్ మరియు సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -