సీఎం కేసీఆర్‌కు బీహార్ సీఎం ఫోన్..

193
kcr nithish kuamr

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో​ తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు.దీనికి స్పందించిన కేసీఆర్‌ పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్‌ పదవీకాలం​ జూన్‌ 1న ముగిసిపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 9న ఎన్నిక జరుగునుండగా ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను బీజేపీ ప్రాతిపాధించింది. ఎన్డీయే అభ్యర్ధిని ఓడించేందుకు కాంగ్రెస్‌ సైతం ప్రయత్నాలను ముమ్మరం​ చేసింది.

ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు 112 మంది ఉన్నారు. తటస్థంగా ఉన్న వారిలో అన్నాడీఎంకే(12), బీజేడీ(9), టీఆర్‌ఎస్‌(6), వైఎస్సార్‌సీపీ(2),ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(1), పీడీపీ(2),
శివసేన(3) ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు బీహార్ సీఎం.