4 గంటలకు నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం..

197
Nirmala Seetharman
- Advertisement -

కరోనా నేపథ్యంలో భారత ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను తెలిపేందకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను వెల్లడించనున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -