ఈ శతాబ్దపు విజయం..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

12
- Advertisement -

ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం అన్నారు. పరాయి పాలన ఒక శాపం !..స్వపరిపాలన ఒక వరం ! అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్ లో ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ మోటార్లు ప్రారంభించనున్న నేపథ్యంలో జరిగే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తానన్నారు. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా అన్నారు. కృష్ణమ్మ నీళ్లను కలశాలలో గ్రామ, గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్ధనాలయాలలో అభిషేకం చేస్తామన్నారు. అనంతరం జరిగిన పరిణామాలలో ఇంటిదొంగలు, పాలోల్లు, పక్క వాళ్లు కేసులు, ఈర్ష, ద్వేషాలతో కేసులు వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకపోవడం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారిందన్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు కల్పించారు..
ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లి రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారన్నారు.

బ్యాంకులు రుణాలు ఇవ్వవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు దాదాపు రూ.25 వేల కోట్లు దశలవారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టును పూర్తిచేసుకుంటున్నాం అన్నారు. ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి అని…ఒక్కొక్కటీ 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులు అవసరం అన్నారు. దశాబ్దాల క్రితమే కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కి ఉంటే దేశంలోనే ఒక హరితప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో అగ్రభాగాన ఉండే ప్రాంతంగా ఈ ప్రాంతం విలసిల్లేదని..ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వం, వెన్నెముక లేని తనం పాలమూరు ప్రజలకు శాపంగా నిలిచిందన్నారు.

Also Read:‘తిరగబడరసామీ’ సాంగ్ రిలీజ్

- Advertisement -