కన్నడ దర్శకుడితో గోపీచంద్

23
- Advertisement -

ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంlo ‘రామబాణం’ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. తాజాగా కన్నడ దర్శకుడితో ఓ సినిమాను ప్రారంభించాడు. నిమ్మ హర్ష కన్నడలో పలు సినిమాలు తీశాడు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమా ఆఫీస్ లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బేనర్ పై కెకే రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కన్నడ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.

ఇదే నెలలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ఘాట్ మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారు. గోపీచంద్ ఈ సినిమాను కంప్లీట్ చేశాక శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ‘రామ బాణం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇలా వరుస సినిమాలతో మ్యాచో స్టార్ లైనప్ బాగానే ఉంది. హర్ష నిమ్మతో చేయనున్న సినిమాను కూడా ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు గోపీచంద్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -