మూడో టెస్టులో భారత్ ఓటమి..

54
- Advertisement -

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రసవత్తర పోరులో భారత్ ఓటమి పాలైంది. 76 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కొల్పోయి చేధించింది.

ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగినా ట్రావిస్ హెడ్ 49, లబుషింగే 28 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. కేవలం మూడు రోజుల్లోనే మూడో టెస్టు ముగిసింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచి భారత్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ పతనాన్ని శాసించారు నాథన్‌ లియాన్‌(8/64). లియాన్ ధాటికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు కుప్పకూలింది. చతేశ్వర్‌ పుజార(59) అర్ధసెంచరీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 109 ఆలౌట్‌
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 163 ఆలౌట్‌

- Advertisement -