నిఖిల్ సినిమా మరింత ఆలస్యం….

247
Nikkil Karthikeya
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. 2014లో చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిఖిల్, చందూ కూడా సీక్వెల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇక ఎవరికి వారు వారి ప్రాజెక్టులలో బిజీ ఉండడంతో వీలుపడడంలేదు. ఇప్పుడు చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే నెక్ట్స్ కార్తీకేయ-2 చేయాలని ఇటు నిఖిల్, అటు చందూ అనుకున్నారు. కానీ ఈ సీక్వెల్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. చందూ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సవ్యసాచి చిత్రాన్ని చేస్తున్నారు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో ప్రాజెక్టు చేయనున్నారు. ఇక హీరో నిఖిల్ కూడా మరో సినిమాతో బీజీగా ఉండడంతో ఈ సీక్వెల్ మరింత ఆలస్యం కానుంది.

- Advertisement -