నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమై ఎంతగా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హ్యాపీ డేస్ సినిమా తర్వాత విజయాలు లేక కొంచెం సతమతమైన ఈ కుర్ర హీరో స్వామి రారా నుంచి విజయాలను అందుకుంటున్నాడు. రీసెంట్ గా కేశవా సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు హల్ చల్ చేశాయి. నిఖిల్ కి హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపార వేత్త కూతురు ‘తేజస్విని’తో వివాహం జరగనున్నట్టు ,వీరి నిశ్చితార్థం ఈ నెల 24వ తేదీన జరుగుతుందని, అక్టోబర్ 1న ఈ ఇద్దరూ పెళ్లి జరగనుందని వార్తలు భయటకు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. నిశ్చిత్తార్థం జరిగిపోయిందని, డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై నటుడు నిఖిల్ స్పందించాడు. `నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు. డిసెంబర్‌లో పెళ్లి అనేది అబద్ధం. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే నాకు లేదు` అని నిఖిల్ అన్నాడు. అలాగే ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించాడు. `పెళ్లి విషయంపై స్పందించే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే పుకార్లకు ప్రాణం పోయకూడదనే స్పష్టత ఇస్తున్నాను. నేను సింగిల్, ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల మీదే నా దృష్టి కేంద్రీకరించాను` అని నిఖిల్ ట్వీట్ చేశాడు.
Ok. I dint want 2 comment on this.. but just to clear the air. I AM SINGLE nd commited only to the 2 movies that I'm working on 😬 @HydTimes pic.twitter.com/tHF1AyEtMx
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 1, 2017