మాజీ భర్త రాకతో పీటలపై ఆగిన పెళ్లి..ఆ తర్వాత ఏంమైందంటే?

281
second marriage
- Advertisement -

వారిద్దరూ కలిసి ఏడాది కిందటే హైదరాబాద్ ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు తల్లితండ్రులు. గత కొద్ది రోజులుగా అమ్మాయిని ఒక రూం బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే అదిలాబాద్ జిల్లాలోని కృష్ణానగర్ లో ఈసంఘటన చోటుచేసుకుంది. కుమురం భీం జిల్లా రెబ్బనకు చెందిన నేతల సంజీవ్ అనే వ్యక్తి చంద్రభాన్ అనే వ్యక్తి కూతురిని ఏడాది కింద ప్రేమించి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు.

అయితే వీరి పెళ్లి చంద్రభాన్ కు ఇష్టం లేకపోవడంతో అమ్మాయిని తీసుకువచ్చి అదిలాబాద్ లోనే ఉంచుకున్నాడు. తాజాగా అమ్మాయికి మరో పెళ్లి చేయాలని భావించాడు చంద్రభాన్. ఈవిషయం తన భర్తకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది సంజీవ్ భార్య. విషయం తెలుసుకున్న సంజీవ్ ఆర్య సమాజ్ లో తాను పెళ్లి చేసుకున్న సర్టిఫికేట్లను , న్యాయవాదిని తిసుకుని పెళ్లి జరుగుతున్న పెళ్లి మండపం వద్దకు వెళ్లాడు . దీంతో అక్కడున్న వారు వీరితో వాగ్వాదానికి దిగి వారిపై దాడి చేశారు. పెళ్లి ఆగిపోవటానికి కారణం నువ్వే అంటూ సంజీవ్ పై దాడికి పాల్పడ్డారు. గొడవ జరుగుతుండటంతో అమ్మాయి తల్లి తండ్రులు అక్కడి నుంచి పరారయ్యారు.

అమ్మాయి తల్లి తండ్రుల కోసం అడ్వొకేట్ కమిషనర్ రంజిత ధన్‌రాజ్‌, న్యాయవాది సలీంలతో కలిసి ఎదురుచూస్తుండగా వారితో వాగ్వాదానికి దిగారు. పెళ్లి మండపం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. గోడవ అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ కృష్ణానగర్‌కు చెందిన ఎస్‌ఐ చంద్రభాన్‌ కుమార్తె మాధవిని ఏడాది కిందట హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నా. అయితే మాధవిని ఆమె తండ్రి బలవంతంగా ఆదిలాబాద్‌కు తీసుకొచ్చి ఏడాది పాటు ఇంట్లోనే ఉంచారు. తనకు మరో పెళ్లి చేస్తున్నారని ఇటీవల మాధవి నాకు ఈ-మెయిల్‌ పంపింది. దీంతో మా ఇద్దరికీ వివాహమైందనే ఆధారాలతో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ కోర్టును ఆశ్రయించి సెర్చ్‌ వారెంటు పొందా. ఆ వారెంటుతో మండపానికి రాగా.. మాపై దాడి చేయడంతోపాటు మాతో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను కొట్టారు అని చెప్పారు.

- Advertisement -