16ఎంపీలను సీఎం కేసీఆర్ 116 చేస్తారుః ఎంపీ కవిత

233
mpkavitha
- Advertisement -

నిజమాబాద్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలన్నారు ఎంపీ కవిత. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం సిరికొండలో ఎంపీ కవిత రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా ఈరోడ్ షో లో కవిత మాట్లాడుతూ..మనం 16 ఎంపీలను ఇస్తే వాటిని సీఎం కేసీఆర్ 116 చేస్తారన్నారు. గిరిజనుల పోడు భూముల సమస్య తొందరలోనే పరిష్కారమవ్వనుందని పేర్కొన్నారు. గిరిజనులకు త్వరలోనే పాస్‌బుక్‌లు ఇస్తామని చెప్పారు.

బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ సమస్యను పరిష్కరించాం. మే 1 నుంచి బీడీ కార్మికులకు రూ.2,016 జీవనభృతి ఇస్తాంమన్నారు. గడిచిన 5సంవత్సరాల్లో ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. సొంత స్థలంలో ఇండ్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.5లక్షల ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీవి పాతాళం నుంచి ఆకాశం వరకూ అన్ని కుంభకోణాలే అన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రధాన మంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్ లో పెన్షన్ రూ.750మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఎంపి కవితకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -