నిహారిక నాకు చెల్లె లాంటిదిః విజయ్ దేవరకొండ

301
vijay devarakonda niharika
- Advertisement -

మెగా డాటర్ నిహారిక ఒక మససు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆసినిమా పెద్దగా విజయం సాధించకపోయినా నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ కూడా అంతగా ఆడలేదు. నిహారిక ప్రస్తుతం సూర్యకాంతం అనే మూవీ నటిస్తోంది. ఈసినిమాలో రాహుల్ విజయ్ నిహారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈచిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కొద్ది రోజులుగా నిహారిక విజయ్ దేవరకొండ లు పెళ్లి చేసుకోబొతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే రిలేషన్ తో విజయ్ దేవరకొండ సూర్యకాంతం ఆడియో ఫంక్షన్ కు వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ రూమర్లకు చెక్ పెడుతూ వారిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ను చెప్పేశాడు విజెయ్. నిహారిక కు ఒక సొదరుడిగా నేను ఈఫంక్షన్ కు వచ్చానని చెప్పాడు. నిహారిక వాళ్ల నాన్న నాగబాబుగారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, అలాగే వరుణ్ తేజ్, రామ్ చరణ్‌ లు అమెరికాలో ఉండటం వల్ల నిహారికకు ఒక పెద్ద అన్నలాగా నేను ఈ ఫంక్షన్ కు రావడం జరిగిందని చెప్పాడు.

‘నాగబాబు గారితో ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించాను. ఆ సినిమాలో నాది కొడుకు పాత్ర. మొదటిరోజు నన్ను కలిసి ఐదు నిముషాలు మాట్లాడిన తర్వాత ‘నువ్వు మంచోడివేనయ్యా.. ఏదో అనుకున్నాను.. నువ్వు మంచోడివేనయ్యా’ అన్నారు. మా ఇద్దరి మధ్య జర్ని అలా మొదలైందని చెప్పారు విజయ్. ‘సూర్యకాంతం’ టీమ్ కు అల్ ది బెస్ట్ చెబుతూ సినిమా గుడ్ ఫన్ లాగా అనిపిస్తోంది.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు విజయ్ దేవరకొండ.

- Advertisement -