మెగా డాటర్ నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా గడుపుతుంది నిహారిక. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న నిహారిక సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈసినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుందన్నారు. కథను నా పాత్రను నమ్మి నేను ఈమూవీ చేశానని చెప్పారు. ఈమూవీలో నా తండ్రి క్యారెక్టర్ లో మురళీశర్మ నటించారని చెప్పారు.
ఆయనతో నటిస్తుంన్నంత సేపు నాకు మా నాన్నే గుర్తొచ్చేవారన్నారు. వెంటనే మానాన్న కు ఫోన్ చేసి ఆయనతో షేర్ చేసుకునే దాన్ని అని చెప్పారు. ఇకపై నేను ఎక్కువగా సినిమాలు చేయనని..ఇంకొ ఐదు, ఆరు సంవత్సరాల తర్వాత సినిమాల్లో నటించనని చెప్పుకొచ్చింది. అంతోపు కర్తవ్వం లాంటి సినిమా ఒక్కటైనా చేయాలని ఉందని చెప్పింది. ఇటివలే ఈవిషయాన్ని పరుచూరిగారితో చెప్పానని..ఆయన కథ రాస్తే నేను చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.
నాకు చిన్నప్పటి నుంచి ఓ కొరిక ఉండేదని..చిరంజీవి గారితో ఒక్క సీన్ అయినా నటించాలని నాకు చిన్నప్పటి నుంచి ఓ కొరిక ఉండేదని తెలిపింది. అయితే ఈసినిమాలో ఛాన్స్ కోసం నేను మొదట చరణ్ అన్నయ్యను అడిగానని ఆయన తనకు సంబంధం లేదని డైరెక్టర్ సురేందర్ రెడ్డిని అడగాలని చెప్పగానే నేను అడగ్గానే సురేందర్ రెడ్డి ఓకే చేశారని చెప్పింది. సైరా సినిమలో పెదనాన్న పక్కన నటిస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.