బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ. తొలి సినిమా మిస్ లవ్ లీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దిఖీ…పలువురు అగ్రహీరోలతో కలిసి నటించాడు. ది లంచ్ బాక్స్,కిక్, బద్‌లాపూర్,బజరంగీ భాయ్ జాన్, షారూక్‌తో రయీస్ సినిమాల్లో తననటనతో మెప్పించాడు. అంతేగాదు తొలిసినిమా మిస్ లవ్ లీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సైతం ఎంపికైంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత రీతుపర్ణ ఛటర్జీ నవాజుద్దీన్ బయోగ్రఫీని `యాన్ ఆర్డినరీ లైఫ్: ఎ మెమొయిర్` పేరుతో రచించింది. దీన్ని నవాజుద్దీన్ విడుదల చేయగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `మిస్ లవ్లీ` నటి నిహారికతో డేటింగ్‌లో పాల్గొన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే పుస్తకంలోని ఈ వ్యాఖ్యలను నిహారిక ఖండించింది. పుస్తకం అమ్మకాల కోసమే నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇలా తప్పుగా మాట్లాడుతున్నాడని ఆరోపించింది. `మిస్ లవ్లీ చిత్రం తర్వాత మేం కొన్ని నెలలే కలిసున్నాం. పుస్తకంలో ఆయన చెప్పిన విధానం చూస్తే చాలా నవ్వొస్తోంది. పుస్తకం అమ్మకాల కోసం మహిళను అగౌరవ పరచాలనుకోవడం సబబు కాదని సూచించింది.
పుస్తకంలో నవాజ్…ఒకసారి నిహారికను మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. తర్వాత ఆమె నన్ను వాళ్లింటికి ఆహ్వానించింది. కొంచెం సంకోచంగానే ఆమె ఇంటికి బయల్దేరాను. వెళ్లి తలుపు కొట్టాను. ఆమె తలుపు తీయగానే ఇల్లంతా వెలుగుతున్న కొవ్వొత్తులు కనిపించాయి. ఆ కొవ్వొత్తుల వెలుగులో ఆమె చాలా అందంగా కనిపించడంతో నా పల్లెటూరి మనసు ఆగలేదు. వెంటనే ఇద్దరం బెడ్రూంలోకి వెళ్లి, గాఢమైన ప్రేమను పంచుకున్నాం. తర్వాత ఆ ప్రేమ ఒకటిన్నర సంవత్సరాలు కొనసాగింది అని బయోగ్రఫీలో పేర్కొనగా దీనిని నిహారిక ఖండించింది.