మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన కాబోయే భర్తతో పాటు ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లారు. అక్కడ తమ ఫ్రెండ్స్‌కు గ్రాండ్‌గా బ్యాచిలరేట్ పార్టీ అరేంజ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక మరి కొద్ది రోజులలో పెళ్ళి పీటలెక్కనుంది. ఆగస్ట్‌లో గుంటూరుకి చెందిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిశ్చితార్ధం జరిగింది.
అయితే కొద్ది రోజులలో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో గోవాకు తన స్నేహితులతో వెళ్ళిన నిహారిక అక్కడ బ్యాచిలర్ పార్టీ జరుపుకుంది.ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది నిహారిక. ఈ అమ్మడు కెరీర్ విషయానికి వస్తే.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ వెబ్ సిరీస్‌తో మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది.