‘హ్యాపీ బ‌ర్త్ డే ల‌వ్..’ నిహారికకు చైతన్య బర్త్‌ డే విషెస్‌..

52
Niharika

మెగా బద్రర్ నాగబాబు కూతురు నిహారిక ఈ రోజు పుట్టినరోజు వేడుకను జరపుకుంటోంది. ఇటీవలే ఆమెకు చైతన్యతో పెళ్లి జరిగిన విషయం తెలసిందే. ప్రతి యేడాది నిహారిక తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కామన్. కానీ ఈ సారి మాత్రం నిహారిక తన మెట్టినింట్లో కొత్త ఇంటిపేరుతో ఈ బర్త్ డే జరుపుకోవడం స్పెషల్ అనే చెప్పాలి. పెళ్లి తర్వాత ఇంటి పేరు మారాకా నిహారిక సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్ ఇది. ఈ సందర్భంగా నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ తన భార్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. నిహారిక త‌న‌ని అల్లుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు.

‘హ్యాపీ బ‌ర్త్ డే ల‌వ్..’ అని ఆయన పేర్కొన్నాడు. ఆమె తనను ఎల్ల‌ప్పుడు ఎంత సంతోషంగా ఉంచుతుందో.. ఆమె కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్‌ వికసిస్తోంది. అలాగే నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో నా జీవితం కూడా వికిసించిందని కవితాత్మకంగా వివరించాడు. కాగా, నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్ర‌ముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.