15న ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదల..

108
PM Narendra Modi

బాలీవుడ్‌ వివేక్‌ ఒబేరాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’. ఈ చిత్రాన్నివిడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మూతపడ్డ థియటర్స్‌ను 50 శాతం ఆక్యుపెన్సీతో అక్టోబర్‌ 15 నుండి ఓపెన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15నే ‘పీఎం నరేంద్ర మోడీ’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను కరోనా నిబంధనలు పాటిస్తూ తెరవడానికి అనుమతులు రావడంతో చివరకు ఈ సినిమాను విడుదల చేయడానికి ఆ సినీ యూనిట్ సిద్ధమైంది. లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా ఇదేనంటూ ఈ చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ నెల 15నే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.