నిధి.. అక్కడ అలా, ఇక్కడ ఇలా

90
- Advertisement -

అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో ఒక బడా సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ… హరి హర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో. మరి పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరో సరసన నటించే ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు కదా. అందుకే.. హరి హర వీరమల్లు సినిమా పూర్తి అయ్యేవరకూ మరో సినిమా చేయకూడదు అని నిధి అగర్వాల్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తెలుగులో ఇంకా మరో సినిమా చెయ్యడం లేదు, కానీ తమిళంలో మాత్రం బిజీ కావడానికి నిధి అగర్వాల్ సన్నాహాలు చేసుకుంటుంది.

ఆమె తాజాగా ఒక తమిళ్ చిత్రానికి సైన్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో ఆర్య. పక్కా మాస్ సినిమా. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రాబోతుంది. మత్సకారుల జీవితాలు ఆధారంగా ఈ సినిమా కథ సాగనుంది. మాధవ్ మాథేశ్వరన్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాలే.

ఐతే, ఇందులో నిధి అగర్వాల్ ది పూర్తిగా డీగ్లామ్ పాత్ర. అలాంటి డీగ్లామర్ పాత్రలో కనిపిస్తుంది నిధి. గుడిసెలో నివసించే పేద యువతి పాత్ర. తమిళంలో అలాంటి పేద అమ్మాయిగా కనిపిస్తున్న ఈ భామ తెలుగులో మాత్రం యువరాణిగా మెరిసిపోతోంది. “హరి హర వీరమల్లు”లో ఆమెది యువరాణి పాత్ర. మొత్తానికి హరి హర వీరమల్లు కోసం నిధి అగర్వాల్ చాలా త్యాగాలు చేసింది. మరి ఆమెకు ఆ సినిమా ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

Also Read:అదే జరిగితే హస్తం “అల్లకల్లోలం ” !

- Advertisement -