గీత దాటితే…టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు!

58
toll

వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ ఫ్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగిందా అలా అయితే ఇకపై టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ప్రతి టోల్ బూత్ దగ్గర 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే ఇక టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపింది.

అప్పటి వరకు క్యూలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే వదిలేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. వాహనదారుల కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ఎన్‌హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. తాజా నిర్ణయంతో టోల్

ప్లాజాల దగ్గర ఒక్కో వాహనానికి రుసుము చెల్లించేందుకు పట్టే కాలం పది సెకన్లకు తగ్గిపోనుందని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.