లాక్ డౌన్ 100 శాతం విజయవంతం: డీజీపీ మహేందర్ రెడ్డి

28
dgp

హైదరాబాద్‌లో లాక్ డౌన్ 100 శాతం విజయవంతమైందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. నగరంలో ఎర్ర‌గ‌డ్డ‌, బాలాన‌గ‌ర్‌, బోయిన్‌ప‌ల్లి, సుచిత్ర‌, కొంప‌ల్లి, కండ్ల‌కోయ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన…లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసుల‌కు డీజీపీ ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయన…లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నారని వెల్లడించారు. ఉదయం 10 గంటల తర్వాత పట్టణాల నుండి పట్టణాలకు, ఒక గ్రామం నుండి మరోక గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయని తెలిపారు. లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గాయ‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డ‌మే పోలీసు శాఖ ల‌క్ష్య‌మ‌ని మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు.