సచివాలయం కూల్చివేత..నిపుణుల కమిటీ ఏర్పాటు

294
telangana
- Advertisement -

సచివాలయం కూల్చివేత పర్యావరణ అనుమతులకు విరుద్దంగా ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌( ఎన్జీటి) ధర్మాసనం.నూతన సచివాలయం నిర్మాణం విషయంలో వెట్ ల్యాండ్ రూల్స్ అమలు, పాత సచివాలయం కూల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, వాయుకాలుష్యం అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్.

కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ,కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఉండగా నోడల్ ఏజెన్సీగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఉండనుంది.రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఎన్ జి టి….తదుపరి విచారణ సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదావేసింది.

- Advertisement -