బాహుబలి దెబ్బకి ఆహా క్రాష్‌..

554
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాపబుల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పటికే పాపులర్ కాగా తాజా ఎపిసోడ్‌కి అతిథిగా ప్రభాస్ వచ్చారు. ఇప్పటికే రిలీజైన ప్రొమోలతో అంచనాలు పెరిగిపోగా ఆ అంచనాలకు తగ్గట్టే ఆహా సైట్ క్రాష్ అయింది.

నిన్న రాత్రి 9 గంటలకి ఎపిసోడ్‌ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు ఆహా యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సైట్ క్రాష్ అయింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. నిడివి ఎక్కువగా ఉండటంతో ఈరోజు రాత్రి ఎపిసోడ్-1, జనవరిలో రెండో ఎపిసోడ్‌ని ప్రసారం చేస్తామని ఆహా చెప్పింది.

ఇప్పటికే రిలీజైన ప్రొమోలో ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర ప్రశ్నలు సంధించారు బాలయ్య. అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌కి కాల్ కలిపిన బాలయ్య.. ప్రభాస్ గురించి వాకబు చేయడం, సంక్రాంతికి తన సినిమా చూసిన తర్వాతే మీ నాన్న సినిమాని చూడాలని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -